సరికొత్త నాయకి వచ్చింది
ABN , First Publish Date - 2023-11-28T06:03:34+05:30 IST
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో హర్షవర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కింది. ‘కూర్మ నాయకి’ అనే టైటిల్ ఖరారు చేశారు...
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో హర్షవర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కింది. ‘కూర్మ నాయకి’ అనే టైటిల్ ఖరారు చేశారు. కె.విజిత రావు నిర్మాత. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత డి.వి.వి.దానయ్య క్లాప్ ఇచ్చారు. లౌక్య సాయి కుమార్ స్విచ్చాన్ చేశారు. బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక దొంగ, ఓ దేవుడు, ఒక దెయ్యం.. వీటి చుట్టూ నడుస్తుంది. దొంగ ఎవరు, దేవుడు ఎవరో సినిమా చూస్తే తెలుస్తుంది. సాంకేతికంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: శేఖర్ చంద్ర.