సరికొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2023-10-27T01:26:15+05:30 IST

వికాస్‌ ముప్పాల, గాయత్రి గుప్తా, స్వాజి పసల, సంతోశ్‌ నందివాడ, కిశోర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ప్లాట్‌’. భానుభవ తారక దర్శకుడు. కార్తీక్‌ సేపురు, భాను భవ తారక, తరుణ్‌ విఘ్నేశ్వర్‌ సేరుపు నిర్మాతలు...

సరికొత్త ప్రయోగం

వికాస్‌ ముప్పాల, గాయత్రి గుప్తా, స్వాజి పసల, సంతోశ్‌ నందివాడ, కిశోర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ప్లాట్‌’. భానుభవ తారక దర్శకుడు. కార్తీక్‌ సేపురు, భాను భవ తారక, తరుణ్‌ విఘ్నేశ్వర్‌ సేరుపు నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో దర్శకుడు వేణు ఉడుగుల చేతుల మీదుగా ట్రైలర్‌ ఆవిష్కరించారు. ‘‘ఇదో సరికొత్త ప్రయోగం. మాటలు, సన్నివేశాలు, శబ్దాలు ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తుంద’’న్నారు వేణు. ‘‘కరోనా సమయంలో రాసుకొన్న కథ ఇది. నా స్నేహితులు నన్ను, నా కథని నమ్మారు. ప్రతి క్రాప్ట్‌ని కొత్తగా చేశామ’’న్నారు దర్శకుడు. నిజాయతీగా చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-10-27T01:26:15+05:30 IST