కొత్త అధ్యాయం మొదలైంది

ABN , First Publish Date - 2023-08-26T05:20:09+05:30 IST

‘ఉత్తమనటిగా జాతీయ అవార్డ్‌ రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డ్‌తో నా నట జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అన్నారు కృతి సనన్‌. ‘మిమి’ చిత్రంతో ఆమెకు ఈ అవార్డ్‌ దక్కింది...

కొత్త అధ్యాయం మొదలైంది

‘ఉత్తమనటిగా జాతీయ అవార్డ్‌ రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డ్‌తో నా నట జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అన్నారు కృతి సనన్‌. ‘మిమి’ చిత్రంతో ఆమెకు ఈ అవార్డ్‌ దక్కింది. అలియా భట్‌తో కలసి జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను ఆమె అందుకోనున్నారు. నటిగా అడుగులు ప్రారంభించి తొమ్మిదేళ్లు అయిన సందర్భంలో ఈ ఆవార్డ్‌ రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కృతి చెప్పారు. ‘ ఇది నాకు, నా కుటుంబ సభ్యులకే కాకుండా ‘మిమి’ చిత్రంలో నాతో కలసి పనిచేసిన వారందరికీ కూడా ఆనందకర క్షణాలే.’ అని చెప్పారామె. ‘మిమి’ చిత్రంలో ఓ విదేశీ జంట కోసం సరోగటేడ్‌ తల్లిగా కృతి నటించారు. ‘నా హృదయానికి హత్తుకున్న సినిమాతోనే తొలి సారిగా జాతీయ అవార్డ్‌ అందుకొనే అవకాశం రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. నా నట జీవితంలో ‘మిమి’ ఓ స్పెషల్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది’ అన్నారు కృతి. ఈ సినిమా కోసం తను 15 కిలోల బరువు పెరిగాననీ, పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంతో కష్టపడ్డాననీ ఆమె చెప్పుకొచ్చారు.

అలియా భట్‌తో కలసి ఉత్తమ నటి అవార్డ్‌ షేర్‌ చేసుకోవడం గురించి కృతి ప్రస్తావిస్తూ ‘ నటిగా అలియా ప్రతిభను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ‘గంగూభాయి కథియావాడి’ చిత్రానికి ఆమెకు అవార్డ్‌ ఇవ్వడం మంచి నిర్ణయం. అవార్డుల ప్రకటన వెలువడగానే అలియాకు ఫోన్‌ చేశాను. ఇద్దరం ఒకరికొకరం అభినందించుకున్నాం.’ అని చెప్పారు కృతి.

Updated Date - 2023-08-26T05:20:09+05:30 IST