మైదానంలో మల్టీస్టారర్‌

ABN , First Publish Date - 2023-02-13T00:50:22+05:30 IST

దేశంలో అమితంగా ఇష్టపడే రంగాలు రెండు. ఒకటి క్రికెట్‌, రెండోది సినిమా. ఈ రెండింటినీ ఏకం చేసిన వేదిక సీసీఎల్‌ (సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌...

మైదానంలో మల్టీస్టారర్‌

దేశంలో అమితంగా ఇష్టపడే రంగాలు రెండు. ఒకటి క్రికెట్‌, రెండోది సినిమా. ఈ రెండింటినీ ఏకం చేసిన వేదిక సీసీఎల్‌ (సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌). సీసీఎల్‌ సరికొత్త ఎడిషన్‌ ఈనెల 18 నుంచి మొదలు కానుంది. ఈసారి 8 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నాయి. ముంబై హీరోస్‌, చెన్నై రైనోస్‌, తెలుగు వారియర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, కేరళ స్ర్టైకర్స్‌, బెంగాల్‌ టైగర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ మైదానంలో తలపడబోతున్నాయి. తెలుగు వారియర్స్‌ జట్టుకి అఖిల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్‌ కథానాయకుడు వెంకటేశ్‌ కో-ఓనర్‌గా వ్యవహరిస్తారు. దేశంలోని వివిధ చిత్రసీమలకు చెందిన 120మంది నటులు ఈ క్రీడా సంబరంలో పాల్గోనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌, రాయపూర్‌, బెంగళూరు, జోథ్‌పూర్‌, త్రివేండ్రం, జైపూర్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated Date - 2023-02-13T00:50:24+05:30 IST