క్లాప్స్‌తో పాటు క్యాష్ కూడా తీసుకొచ్చే సినిమా
ABN , First Publish Date - 2023-01-21T05:44:22+05:30 IST
సుహాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు...
సుహాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రముఖ కథానాయకుడు అడవి శేష్ ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సుహాస్ చాలా మంచి నటుడు. ట్రైలర్‌లో రోహిణి గారి నటన హృదయాన్ని హత్తుకొనేలా ఉంద’’న్నారు. హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా బాగుంది. చాలా రోజుల తరవాత వెండి తెరపై పుస్తకాలు కనిపించాయి. పాండమిక్ సమయంలో సుహాస్ వీడియోలు పెద్ద రిలీఫ్ అందించాయి. చిత్రసీమలో రాజకీయాలు, నెపోటిజం అని చాలా విషయాలు మాట్లాడుకొంటారు. వాటన్నింటికీ సమాధానం సుహాస్’’ అన్నారు. ‘‘కలర్ ఫొటో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు తొలిసారి థియేటర్లో నా సినిమా ఆడబోతోంది. సినిమా చూశాక రెండు మూడు గంటలు అదే హ్యాంగోవర్‌లో ఉంటారు. అంతగా నచ్చేస్తుందన్నారు’’ సుహాస్. దర్శకుడు మాట్లాడుతూ ‘‘క్లాప్స్‌తో పాటు క్యాష్ కూడా తీసుకొచ్చే సినిమా ఇది. పద్మ భూషణ్‌గా సుహాస్ నటన అందరినీ మెప్పిస్తుంద’’న్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.