దాసరిపై ఓ సినిమా

ABN , First Publish Date - 2023-02-10T00:17:44+05:30 IST

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావుపై ఓ సినిమా తీయబోతున్నట్టు నిర్మాత నట్టి కుమార్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఇది దాసరి చరిత్ర’ అని నామకరణం చేశారు..

దాసరిపై ఓ సినిమా

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావుపై ఓ సినిమా తీయబోతున్నట్టు నిర్మాత నట్టి కుమార్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఇది దాసరి చరిత్ర’ అని నామకరణం చేశారు. మే 4న దాసరి జయంతి సందర్భంగా ఈ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘‘దాసరిని రెండు తెలుగు ప్రభుత్వాలూ మర్చిపోయాయి. కానీ ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయన చరిత్ర, ఘనత ఈ తరానికి అర్థమయ్యేలా ఈ సినిమా తీయబోతున్నాం. ఓ తమిళ స్టార్‌ హీరో తనయుడు ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇది దాసరి బయోపిక్‌ కాదు. ఆయన జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాలకు తెర రూపం’’ అన్నారు.

Updated Date - 2023-02-10T00:17:47+05:30 IST