చిరు ఆపరేషన్
ABN , First Publish Date - 2023-08-16T03:32:06+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ చిత్రం ఇటీవల విడుదల అయిన విషయం విదితమే. యువతరం హీరోలకు దీటుగా అందులో స్టెప్పులు వేసి, ఫైట్స్ చేసి ఆయన...

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ చిత్రం ఇటీవల విడుదల అయిన విషయం విదితమే. యువతరం హీరోలకు దీటుగా అందులో స్టెప్పులు వేసి, ఫైట్స్ చేసి ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, ఈ సినిమా విడుదలయ్యాక కొంత గ్యాప్ దొరకడంతో డిల్లీ వెళ్లి మోకాలుకు సంబంధించిన చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. వారం రోజులు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుని పుట్టిన రోజు సమయానికి హైదరాబాద్ తిరిగి వస్తారు. ఆయన వచ్చిన తర్వాత కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.