గుర్తుండిపోయే ప్రేమకథ
ABN , First Publish Date - 2023-10-31T06:07:02+05:30 IST
సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుమన్ పాతూరి దర్శకుడు...

సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుమన్ పాతూరి దర్శకుడు. ‘బేబి’ ఫేమ్ సాయి రాజేశ్ కథని అందించారు. ఎస్.కె.ఎన్, సాయి రాజేశ్ నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి యువ కథానాయకుడు నాగచైతన్య క్లాప్ ఇచ్చారు. చందూ మొండేటి స్విచ్చాన్ చేశారు. వశిష్ట గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నేను, ఎస్.కె.ఎన్ కలిసి ఆరు ప్రేమకథలు చెప్పాలనుకొన్నాం. ఇది నాలుగో సినిమా. నా మనసుకి దగ్గరైన కథ. ఈ ప్రేమ కథ ఎప్పటికీ గుర్తుండిపోతుంద’’న్నారు సాయి రాజేశ్. ‘‘బేబీ తరవాత మా సంస్థపై అంచనాలు పెరిగాయి. వాటిని కాపాడుకొనే సినిమా ఇది. ‘బేబీ’లానే పెద్ద హిట్ అవుతుంది. నేను నిర్మాతగా చేసిన ప్రతీ సినిమాలోనూ తెలుగు అమ్మాయినే కథానాయికగా ఎంచుకొన్నాను. ఈసారి కూడా ఓ తెలుగు అమ్మాయునే పరిచయం చేస్తున్నా’’ అన్నారు ఎస్.కె.ఎన్. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.