కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mega Arambam : మెగా ఆరంభం

ABN, First Publish Date - 2023-09-11T02:00:16+05:30

చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మెగా 157’ వర్కింగ్‌ టైటిల్‌. ఈ చిత్రం పూర్వ నిర్మాణ పనులు...

చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మెగా 157’ వర్కింగ్‌ టైటిల్‌. ఈ చిత్రం పూర్వ నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని వశిష్ట సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్‌ సాహసయాత్రకు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు డీవోపీగా పనిచేస్తారని తెలిపారు. ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను ఈ సందర్భంగా వశిష్ట షేర్‌ చే శారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ బేనర్‌పై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇతర వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.

Updated Date - 2023-09-11T02:00:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!