‘అ’ అంటే అందం... ‘ఆ’ అంటే ఆకర్షణ
ABN , First Publish Date - 2023-04-04T03:49:27+05:30 IST
జాన్వీకపూర్ తెలుగులో ఎప్పుడెప్పుడు నటిస్తుందా? అంటూ టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూసింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో.. అరంగేట్రానికి సిద్దమైంది జాన్వీ. ఎంట్రీ కాస్త లేటయ్యింది కానీ...
జాన్వీకపూర్ తెలుగులో ఎప్పుడెప్పుడు నటిస్తుందా? అంటూ టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూసింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో.. అరంగేట్రానికి సిద్దమైంది జాన్వీ. ఎంట్రీ కాస్త లేటయ్యింది కానీ, సరైన సమయంలో.. సరైన ప్రాజెక్ట్‌తోనే వస్తోంది. ఎన్టీఆర్ అంటే జాన్వీకి చాలా అభిమానం. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అదే సమయంలో జాన్వీకి కొన్ని సవాళ్లు కూడా ఎదురు కానున్నాయి. డాన్సుల్లో, డైలాగ్ డెలివరీలో తారక్‌తో పోటీ పడాల్సివస్తుంది. అందుకే ఈ రెండు విషయాలపై చాలా ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు డిక్షన్‌పై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగా ఓ తెలుగు మాస్టారుని నియమించుకొందట. ఆయన దగ్గరే తెలుగు నేర్చుకొంటోందట. అంతేకాదు.. తెలుగు సినిమాలు చూస్తూ, తెలుగు డైలాగుల్ని వల్లివేస్తోందట. అవకాశం వస్తే తన డబ్బింగ్ తానే చెప్పుకోవాలని చూస్తోందట. ఈ విషయంలో తల్లిని ఆదర్శంగా తీసుకొంది జాన్వీ. శ్రీదేవి కూడా అంతే. అందంలోనే కాదు, డిక్షన్‌లోనూ తనకి తానే సాటి అనిపించుకొంది. తన డబ్బింగ్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. మరి జాన్వీ తెలుగు భాషా ప్రావీణ్యం ఎలా ఉంటుందో తెలియాంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.