కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సిద్దార్థ్‌ రాయ్‌ ఆలపించిన ప్రేమగీతం

ABN, First Publish Date - 2023-08-26T05:14:35+05:30

దీపక్‌ సరోజ్‌ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సిద్దార్థ్‌ రాయ్‌’. వి.యశస్వీ దర్శకత్వం వహిస్తున్నారు. జయ ఆడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మాతలు..

దీపక్‌ సరోజ్‌ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సిద్దార్థ్‌ రాయ్‌’. వి.యశస్వీ దర్శకత్వం వహిస్తున్నారు. జయ ఆడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘లైఫ్‌ ఈజ్‌ దిస్‌ బ్యూటీఫుల్‌’ అనే గీతాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. రథన్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని యశస్వీ రాశారు. కార్తీక్‌, శ్రీనిషా ఆలపించారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ప్రేమ గీతమిది. వారిద్దరి కెమిస్ర్టీతో పాటు, లొకేషన్లు ఆకట్టుకొన్నాయి. ‘‘ప్రేమకథని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాం. సిద్దార్థ్‌ రాయ్‌ పాత్ర చిత్రణ ప్రధాన ఆకర్షణ. టీజర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-08-26T05:14:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!