భైరవకోనలో ప్రేమగీతం
ABN , First Publish Date - 2023-10-26T01:51:33+05:30 IST
సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు...
సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘హమ్మా హమ్మా’ అంటూ సాగే ప్రేమగీతాన్ని యూనిట్ ఈనెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సందీప్‌కిషన్, క థానాయిక వర్షబొల్లమ్మ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. సినిమాటోగ్రఫీ: రాజ్ తోట