గ్లోబల్ కథ
ABN, First Publish Date - 2023-09-03T01:27:50+05:30
‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కన్నడ హీరో కిచ్చా సుదీప్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్.చంద్రూ ఈ సినిమాను రూపొందించనున్నారు...
‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కన్నడ హీరో కిచ్చా సుదీప్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్.చంద్రూ ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్ర్కిప్ట్ సూపర్ విజన్ చేస్తుండడం విశేషం. కన్నడంలో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆర్.సీ. స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించనుంది. దర్శకుడు ఆర్.చంద్రూ, కిచ్చా సుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఈ నెల్లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా కొన్ని విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చంద్రూ చెప్పారు.