పలానా అబ్బాయితో అమ్మాయి

ABN , First Publish Date - 2023-01-03T00:16:04+05:30 IST

‘కల్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెర మీద మ్యాజిక్‌ చేసిన నాగశౌర్య, మాళవిక నాయర్‌ మరోసారి జంటగా నటించిన చిత్రం ‘పలనా అబ్బాయి.. పలానా అమ్మాయు’...

పలానా అబ్బాయితో అమ్మాయి

‘కల్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెర మీద మ్యాజిక్‌ చేసిన నాగశౌర్య, మాళవిక నాయర్‌ మరోసారి జంటగా నటించిన చిత్రం ‘పలనా అబ్బాయి.. పలానా అమ్మాయు’. ఈ ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌కు అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదల చేశారు. నాగశౌర్య, మాళవిక ఫార్మల్‌ వింటర్‌వేర్‌లో ఉండి, ఒకరిపై మరొకరు వాలిపోయి సంగీతం వింటూ ఈ పోస్టర్‌లో కనిపించారు. ‘ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య జరిగే ప్రేమ ప్రయాణం ఈ చిత్రం. హెచ్చు తగ్గులు కలిగిన ఆ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను కూడా వారితో పాటు తీసుకెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా, హృదయానికి హత్తుకొనే విధంగా ఉంటాయి. ఇంద్రధనుస్సులోని ఏడు విభిన్న రంగుల్లా ప్రేమను ప్రదర్శిస్తున్నాం’ అని దర్శకుడు అవసరాల చెప్పారు.

Updated Date - 2023-01-03T00:16:07+05:30 IST