అంబాజీపేట అమ్మాయి

ABN , First Publish Date - 2023-08-26T05:16:02+05:30 IST

సుహాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..

అంబాజీపేట అమ్మాయి

సుహాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో శివాని నాగరం కథానాయికగా పరిచయం అవుతోంది. శుక్రవారం శివాని పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ లుక్‌లో శివాని పద్ధతిగా, అచ్చ తెనుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ‘‘వరలక్ష్మి పాత్రలో శివాని నటన ఆకట్టుకొంటుంది. పక్కింటి అమ్మాయి తరహాలో ఈ పాత్రని తీర్చిదిద్దాం. మల్లిగా సుహాస్‌ నవ్విస్తాడు. చిత్రీకరణ తుది దశకు వచ్చింది. త్వరలోనే టీజర్‌ విడుదల చేస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-08-26T05:16:02+05:30 IST