మునుపెన్నడూ చూడని ఆట

ABN , First Publish Date - 2023-08-16T03:27:38+05:30 IST

కేకే మీనన్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లవ్‌ ఆల్‌’. సుధాంశు శర్మ దర్శకుడు. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్‌ పతాకంపై ఎం.రమేశ్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. మహేష్‌ భట్‌, ఆనంద్‌ పండిట్‌, పుల్లెల గోపీచంద్‌ సమర్పకులుగా...

మునుపెన్నడూ చూడని ఆట

కేకే మీనన్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లవ్‌ ఆల్‌’. సుధాంశు శర్మ దర్శకుడు. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్‌ పతాకంపై ఎం.రమేశ్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. మహేష్‌ భట్‌, ఆనంద్‌ పండిట్‌, పుల్లెల గోపీచంద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘బ్యాట్మెంటెన్‌ నేపథ్యంలో ఓ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్‌ని కెరీర్‌గా మలచుకోవాలని ఆశ పడే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంద’’న్నారు. ‘‘బ్యాట్మెంటెన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆటని మునుపెన్నడూ చూడని విధంగా తెరపై ఆవిష్కరించాం. ఈ ఆట గురించి తెలియనివాళ్లకూ ఈ సినిమా నచ్చుతుం ద’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-08-16T03:27:38+05:30 IST