A fish that turned into a whale : తిమింగలంలా మారిన చేప
ABN , First Publish Date - 2023-10-30T01:25:24+05:30 IST
తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్. ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్. ఆర్ ప్రభు నిర్మించారు...

తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్. ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్. ఆర్ ప్రభు నిర్మించారు. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం చెన్నైలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. హీరో సూర్య ‘జపాన్’ ట్రైలర్‌ను ఆవిష్కరించి సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ‘తిమింగలమైన బుల్లి చేప’ అంటూ ట్రైలర్‌లో కథను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునీల్, విజయ్ మిల్టన్ కీలకపాత్రలు పోషించారు.