ప్రజల కోసం తీసిన సినిమా

ABN , First Publish Date - 2023-10-22T01:53:24+05:30 IST

సంపూర్ణేశ్‌ బాబు, వి.కె.నరేశ్‌, శరణ్య ప్రదీప్‌ నటించిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాతో పూజ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు...

ప్రజల కోసం తీసిన సినిమా

సంపూర్ణేశ్‌ బాబు, వి.కె.నరేశ్‌, శరణ్య ప్రదీప్‌ నటించిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమాతో పూజ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ నాకు రావడానికి కారణం దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఆయన దగ్గర ‘మర్మాణువు’ చిత్రం కోసం పనిచేస్తున్న సమయంలో వైనాట్‌ స్టూడియో సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ రీమేక్‌ కోసం ఆయన్ని సంప్రదించారు. ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించలేననీ, నిర్మాణ భాగస్వామిగా ఉంటానని వెంకటేశ్‌ మహా చెప్పారు. దాంతో ఆ సినిమాకు నేను పని చేస్తానని అడిగాను. నిర్మాతలు ఒకే అనడంతో ఈ ప్రాజెక్ట్‌ మొదలైంది. ఇందులో కీలక పాత్ర కోసం సంపూర్ణేశ్‌ బాబుని తీసుకోవాలన్నిది మహా గారి ఆలోచన. ఈ పాత్రకు ఆయన వెయ్యి శాతం సరిపోయారు. ఈ పాత్ర ఆయన కోసమే పుట్టినట్లుంది. తమిళ రాజకీయాలను, అక్కడి సంస్కృతినీ ‘మండేలా’ చిత్రం చూపించింది. తెలుగుకు తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ప్రజలు ఎలా బతుకుతున్నారో చూపించే ప్రయత్నం చేశాం. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల గురించి సినిమాలు వస్తాయి. కానీ ప్రజల కోసం ఎలాంటి చిత్రాలూ రావు. అందుకే ప్రజల కోసం, వారి ప్రాముఖ్యం తెలియజెప్పడం కోసం ఈ సినిమా తీశాం’’ అన్నారు.

Updated Date - 2023-10-22T01:53:24+05:30 IST