పజిల్ లాంటి సినిమా
ABN , First Publish Date - 2023-09-14T00:31:56+05:30 IST
సూర్య, విషిక జంటగా నటించిన చిత్రం ‘అష్ట దిగ్బంధనం’. బాబా పి. ఆర్ దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించారు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది...

సూర్య, విషిక జంటగా నటించిన చిత్రం ‘అష్ట దిగ్బంధనం’. బాబా పి. ఆర్ దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించారు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అష్ట దిగ్బంధనం’ ట్రైలర్‌ను మంగళవారం దర్శకుడు సాయిరాజేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అష్ట దిగ్బంధనం’ అనేది పవర్‌ఫుల్ టైటిల్. ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి ప్రోత్సహించాల’ని ప్రేక్షకులను కోరారు. మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్. కథను నమ్మి ఈ సినిమా నిర్మించా. బాబా సినిమాను అద్భుతంగా తీశారు’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అష్ట దిగ్బంధనం’ దర్శకుడిగా నా రెండో చిత్రం. ఇది పజిల్ లాంటి సినిమా. ప్రతి సన్నివేశం ప్రేక్షకుణ్ణి థ్రిల్ చేస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జాక్సన్ విజయన్. సినిమాటోగ్రఫీ: బాబు కొల్లాబత్తుల.