పోరాట యోధుని కథ

ABN , First Publish Date - 2023-11-14T04:30:38+05:30 IST

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ‘చే’ చిత్రం ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. బీఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు..

పోరాట యోధుని కథ

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ‘చే’ చిత్రం ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. బీఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ క్యూబా తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్‌ ఇది. ఈ సినిమా తీయాలన్నది నా ఇరవై ఏళ్ల కల. చేగువేరా జీవితంలో జరిగిన ఎన్నో అరుదైన విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కుమార్తె డాక్టర్‌ అలైదా గువేరా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - 2023-11-14T04:30:40+05:30 IST