నాన్ స్టాప్ నవ్వుల పండగ
ABN , First Publish Date - 2023-06-04T02:27:53+05:30 IST
విజె సన్నీ, సప్తగిరి కథానాయకులుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్‌రావు నిర్మాత. ఈనెల 9న విడుదల అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా...

విజె సన్నీ, సప్తగిరి కథానాయకులుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్‌రావు నిర్మాత. ఈనెల 9న విడుదల అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘రత్నబాబు అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే తనకూ అభిమానం. ఈ సినిమాలో నాకో పాత్ర ఇవ్వాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. ఇంతమంది హాస్య నటుల్ని ఒకే సినిమాలో చూస్తుంటే జంధ్యాల గారితో పని చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. వీళ్లలో నన్ను నేను చూసుకొంటున్నా. అందరూ బ్రహ్మానందంలానే పైకి రావాలని కోరుకొంటున్నా’’ అన్నారు. ‘‘నాన్ స్టాప్ నవ్వుల హంగామా ఈ సినిమా. షూటింగు పండగలా జరిగింది. సినిమా కూడా అలానే ఉంటుంద’’న్నారు దర్శకుడు.