ఫ్యామిలీ ఎంటర్టైనర్‌

ABN , First Publish Date - 2023-11-15T01:01:41+05:30 IST

వీజే సన్నీ, హ్రితిక జంటగా నటించిన చిత్రం ‘సౌండ్‌పార్టీ’. ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న తొలి చిత్రమిది. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్‌ గజేంద్ర నిర్మిస్తున్నారు...

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌

వీజే సన్నీ, హ్రితిక జంటగా నటించిన చిత్రం ‘సౌండ్‌పార్టీ’. ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న తొలి చిత్రమిది. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్‌ గజేంద్ర నిర్మిస్తున్నారు. సంజయ్‌ శేరి దర్శకుడు. ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సౌండ్‌ పార్టీ’ సాంగ్స్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. బిజినెస్‌ పరంగా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇదొక వినోదాత్మక కుటుంబ కథా చిత్రం’ అన్నారు. సమర్పకుడు జయశంకర్‌ మాట్లాడుతూ ‘మా దర్శకుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తీశాడు’ అని ప్రశంసించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా చూసి, యూనిట్‌ అంతా బాగుందని మెచ్చుకుంది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుంద’న్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి కీలకపాత్రలు పోషించారు.

Updated Date - 2023-11-15T01:01:44+05:30 IST