పుష్పరాజ్‌తో ఒకరోజు

ABN , First Publish Date - 2023-08-31T02:37:42+05:30 IST

‘పుష్ప’ చిత్రంతో నటుడిగా తన ఇమేజ్‌ని తారాస్థాయికి తీసుకెళ్లారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ పాత్ర తనకు దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించిపెట్టింది. ఇక ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్న తర్వాత...

పుష్పరాజ్‌తో ఒకరోజు

‘పుష్ప’ చిత్రంతో నటుడిగా తన ఇమేజ్‌ని తారాస్థాయికి తీసుకెళ్లారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ పాత్ర తనకు దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించిపెట్టింది. ఇక ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్న తర్వాత ప్రజల్లో ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. అల్లు అర్జున్‌ దినచర్యను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకూ ఒక రోజులో బన్నీ ఏమేం చేస్తాడు అనే విషయాలను చూపిస్తూ బుధవారం ఓ వీడియో విడుదల చేయగా వైరల్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థ ఒక భారతీయ నటుడితో ఇలాంటి వీడియో రూపొందించడం ఇదే తొలిసారి. దీనికోసం ఇన్‌స్టా టీం హైదరాబాద్‌కు వచ్చి, అల్లు అర్జున్‌తో ఓ రోజంతా ఉండి ఈ వీడియోను రూపొందించింది. అల్లు అర్జున్‌ ఉదయం లేవగానే యోగా చేయడం, పిల్లలతో సరదాగా గడపడం, షూటింగ్‌కు సన్నద్ధమైన తీరు లాంటి విషయాలను ఈ వీడియోలో చూపించారు. ‘పుష్ప 2’ షూటింగ్‌ కూడా చూపించారు. సుకుమార్‌తో సీన్‌ గురించి చర్చించిన తీరు, ప్యాక్‌ అప్‌ చెప్పడం, అభిమానులను బన్నీ రిసీవ్‌ చేసుకునే విధానం ఆసక్తికరంగా అనిపించాయి.

Updated Date - 2023-08-31T02:37:42+05:30 IST