ప్రేక్షకులు మెచ్చే పరారీ
ABN , First Publish Date - 2023-03-19T00:40:25+05:30 IST
నిర్మాత జి.వి.వి గిరి తనయుడు యోగేశ్వర్, అతిథి జంటగా సాయిశివాజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పరారీ’. సుమన్, అలీ, మకరంద్ దేశ్‌ముఖ్ కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 30న విడుదలవుతోంది...

నిర్మాత జి.వి.వి గిరి తనయుడు యోగేశ్వర్, అతిథి జంటగా సాయిశివాజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పరారీ’. సుమన్, అలీ, మకరంద్ దేశ్‌ముఖ్ కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అంజన్‌కుమార్ యాదవ్, సుమన్ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణగౌడ్ థియేట్రికల్ ప్రోమోను విడుదల చేశారు. ప్రేక్షకులకు మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది, హీరో యోగేశ్ బాగా నటించాడని సుమన్ ప్రశంసించారు. ‘పరారీ’ సినిమాలో పాటలు బావున్నాయని నటి కవిత మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో మంచి కథ, కామెడీ , ఫైట్స్ ఉన్నాయని యోగేశ్వర్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్.