లా చదివిన క్రిమినల్
ABN , First Publish Date - 2023-03-29T02:35:47+05:30 IST
రవితేజ లాయర్ పాత్ర పోషించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. సుశాంత్ కీలక పాత్ర పోషించారు. మంగళవారం ట్రైలర్ విడుదలైంది...

రవితేజ లాయర్ పాత్ర పోషించిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. సుశాంత్ కీలక పాత్ర పోషించారు. మంగళవారం ట్రైలర్ విడుదలైంది. ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్’, ‘మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్, ఐ యామ్ ఎన్ ఆర్టిస్..’ అనే సంభాషణలు ఈ ట్రైలర్‌లో వినిపించాయి. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అను ఇమ్మానియేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. ఈ చిత్రానికి భీమ్స్, హర్షవర్థన్ సంగీతాన్ని సమకూర్చారు.