సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త హీరోతో క్రైమ్‌ థ్రిల్లర్‌

ABN, First Publish Date - 2023-06-03T00:20:40+05:30

ప్రదీప్‌ విరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపుదిద్దుకోనున్న చిత్రం షూటింగ్‌ గురువారం సాయంత్రం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రదీప్‌ విరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపుదిద్దుకోనున్న చిత్రం షూటింగ్‌ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. దివ్యా ఖుష్వా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మనోజ్‌ ఎల్లుమహంతి దర్శకత్వంలో బంగారు నవీన్‌కుమార్‌( బి.ఎన్‌.కె.) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు సీనియర్‌ దర్శకుడు వి.సముద్ర కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా తొలి క్లాప్‌ ఇచ్చారు. వ్యాపారవేత్త రామ్‌ ఎర్రమ్‌ స్ర్కిప్ట్‌ను దర్శకుడికి అందించారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమయ్యే ఈ చిత్రం గురించి నిర్మాత బీఎన్‌కే మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. అందుకే నిర్మాణపరంగా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని చెప్పారు. ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ప్రతి సీన్‌ ఉత్కంఠ కలిగిస్తుంది. నిర్మాత నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: పంకజ్‌ తట్టోడ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ప్రసన్న ఆంజనేయులు.

Updated Date - 2023-06-03T00:20:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!