Chiru comedy with DJ Tillu : డీజే టిల్లుతో చిరు కామెడీ!
ABN, First Publish Date - 2023-05-04T03:18:05+05:30
ఈ యేడాది ‘వాల్తేరు వీరయ్య’తో ఓ సూపర్ హిట్ అందుకొన్నారు చిరంజీవి. ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా ఉన్నారు...
ఈ యేడాది ‘వాల్తేరు వీరయ్య’తో ఓ సూపర్ హిట్ అందుకొన్నారు చిరంజీవి. ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తరవాత చిరు చేయబోయే సినిమా ఏమిటన్న విషయంలో ఇప్పుడిప్పుడే ఓ స్పష్టత వస్తోంది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ చెప్పిన కథకు చిరు పచ్చ జెండా ఊపారని సమాచారం అందుతోంది. ఇందులో ఓ యువ హీరో పాత్రకూ ప్రాధాన్యం ఉందని, ఆ క్యారెక్టర్‌లో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘డీజే టిల్లు’తో ఓ సూపర్ హిట్ అందుకొన్నాడు సిద్దు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. చిరుతో గనుక నటించే ఆఫర్ వస్తే మాత్రం సిద్దూ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకొన్నట్టే. ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.