ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర

ABN , First Publish Date - 2023-01-14T01:35:05+05:30 IST

‘తమిళంలో నేను చాలా మంచి చిత్రాల్లో నటించాను. అయితే ఒక మంచి కథతో యూవీ వంటి పెద్ద బేనర్‌ ద్వారా...

ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర

‘తమిళంలో నేను చాలా మంచి చిత్రాల్లో నటించాను. అయితే ఒక మంచి కథతో యూవీ వంటి పెద్ద బేనర్‌ ద్వారా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ’ అన్నారు ప్రియా భవానీ శంకర్‌. ఆమె నటించిన ‘కల్యాణం కమనీయం’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

‘ఈగో సమస్యలు లేని ఓ భార్య, భర్తల మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. వీళ్ల గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ల మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య చివరికి ఎంత దూరం వెళ్లిందన్నదే కథాంశం’ అని ఆమె వివరించారు. ‘ఇందులో శ్రుతి పాత్రకు, నాకు దాదాపు 90 శాతం పోలికలు ఉన్నాయి. అందుకే ఆ పాత్ర పోషించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కలగలేదు. తెలుగు ప్రేక్షకులు నా పాత్రను ఎలా రిసీవ్‌ చేసుకుంటారని మాత్రం టెన్షన్‌గా ఉంది’ అన్నారు ప్రియ. ‘సంతోష్‌ అద్భుతమైన నటుడు. డైలాగ్స్‌ విషయంలో నాకు సహాయం చేశారు. అనిల్‌ లాంటి చాలా మంది కొత్త దర్శకులతో నేను పనిచేశాను. అనిల్‌ ప్రతిభావంతుడు. ఆయన తయారు చేసిన కథ, రాసిన మాటలు బాగున్నాయి. ప్రతి ఒక్కరూ శ్రుతి పాత్రతో ఐడెంటిఫై చేసుకుంటారు’ అన్నారామె. ఈ ఏడాది నాగచైతన్యతో ‘దూత’, సత్యదేవ్‌ చిత్రాల్లో నటించనున్నట్లు ప్రియా చెప్పారు.

Updated Date - 2023-01-14T01:35:09+05:30 IST