సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రీదేవిపై పుస్తకం

ABN, First Publish Date - 2023-02-10T00:19:30+05:30

అలనాటి అందాల నటి శ్రీదేవి బయోగ్రఫీ రానుంది. ధీరజ్‌ కుమార్‌ అనే రచయిత శ్రీదేవి చరిత్రకు అక్షరరూపం ఇవ్వబోతున్నారు. ధీరజ్‌కీ, శ్రీదేవి కుటుంబానికీ సన్నిహిత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలనాటి అందాల నటి శ్రీదేవి బయోగ్రఫీ రానుంది. ధీరజ్‌ కుమార్‌ అనే రచయిత శ్రీదేవి చరిత్రకు అక్షరరూపం ఇవ్వబోతున్నారు. ధీరజ్‌కీ, శ్రీదేవి కుటుంబానికీ సన్నిహిత సంబంధాలున్నాయి. వెస్ట్‌లాండ్‌ బుక్స్‌ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించబోతోంది. ఇప్పటికే శ్రీదేవికి సంబంధించిన రీసెర్చ్‌ని ధీరజ్‌ పూర్తి చేశారు. నలభై ఏళ్ల సినీ ప్రయాణం, అందులోని ఒడిదుడుకులు, సాధించిన అపూర్వ విజయాలు, వ్యక్తిగత జీవితం ఈ విషయాలన్నీ ఈ బయోగ్రఫీలో పొందుపరచనున్నారు. ఈ సందర్భంగా బోనీకపూర్‌ మాట్లాడుతూ ‘శ్రీదేవి ఓ అద్భుతం. నటన అంటే ఆమెకు ఎంతో ఇష్టం. తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచేది. మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ధీరజ్‌ ఆమె జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అనందంగా ఉంది’ అన్నారు.

Updated Date - 2023-02-10T00:19:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!