అందమైన ప్రేమకథ

ABN , First Publish Date - 2023-01-30T00:31:44+05:30 IST

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది..

అందమైన ప్రేమకథ

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు సాగుతున్నాయి. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ ఇది. సంగీతానికి ప్రాధాన్యం ఉంది. బుధవారం తొలి గీతాన్ని విడుదల చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-01-30T00:31:46+05:30 IST