కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్టోబర్‌లో 800

ABN, First Publish Date - 2023-09-15T01:03:23+05:30

శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ఎం. ఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌ ...

శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ఎం. ఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్‌ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌ నటించారు. వివేక్‌ రంగాచారి నిర్మించారు. ప్రముఖ నిర్మాత, శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రం విడుదల హక్కులను దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన గురువారం చెప్పారు. క్రికెట్‌ ప్రేమికులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉన్న చిత్రమిదని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్‌, నరెన్‌, నాజర్‌ కీలకపాత్రలు పోషించారు. సంగీతం: జిబ్రాన్‌

Updated Date - 2023-09-15T01:03:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!