అపరిచితుల కథ

ABN , First Publish Date - 2023-04-15T00:16:48+05:30 IST

గుల్షన్‌ దేవయ్య, సయామి ఖేర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘8 ఏ. ఎం మెట్రో’. ‘మల్లేశం’ చిత్రం ఫేం రాజ్‌ రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు.

అపరిచితుల కథ

గుల్షన్‌ దేవయ్య, సయామి ఖేర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘8 ఏ. ఎం మెట్రో’. ‘మల్లేశం’ చిత్రం ఫేం రాజ్‌ రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. మే 19న విడుదలవుతోంది. శుక్రవారం చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత గుల్జార్‌ మాట్లాడుతూ ‘స్ర్కిప్ట్‌ చదివినప్పుడు చాలా గొప్ప అనుభూతి కలిగింది. చిత్రానికి నా వంతు సహకారం అందించాలనిపించి ఆరు కవితలు రాశాను’ అన్నారు. రాజ్‌ మాట్లాడుతూ ‘ఇది మెట్రోలో అనుకోకుండా కలుసుకొని ఒకరినొకరు తెలుసుకునే అపరిచితుల కథ. గుల్జార్‌ సాబ్‌కు రుణపడి ఉంటాను’ అని చెప్పారు. మనుషులను, నమ్మకాలను విడగొట్టే పాత్ర చేశాను అని గుల్షన్‌ తెలిపారు. ఈ చిత్రానికి మార్క్‌ కె. రాబిన్‌ సంగీతం అందించారు.

Updated Date - 2023-04-15T08:22:46+05:30 IST