75 రోజుల్లో 75వ చిత్రం

ABN , First Publish Date - 2023-10-31T06:10:10+05:30 IST

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

75 రోజుల్లో 75వ చిత్రం

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకుడు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంటే.. మరో 75 రోజుల సమయం ఉంది. వెంకటేశ్‌కి ఇది 75వ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. వెంకటేశ్‌ స్టైల్‌లో సాగే సున్నితమైన భావోద్వేగాలూ ఉంటాయి. పోరాట ఘట్టాలకు పెద్ద పీట వేశాం. వెంకీకి ఇది మైలు రాయిలాంటి సినిమా. అందుకే గుర్తిండిపోయే స్థాయిలో రూపొందించాం. నవాజుద్దీన్‌ సిద్దిఖీ ఓ కీలక పాత్ర పోషించారు. ఆయన నటన ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ’’ అని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-10-31T06:10:28+05:30 IST