6 గెటప్పులు.. 38 భాషలు

ABN , First Publish Date - 2023-11-21T00:28:34+05:30 IST

సినిమాకి భాషా పరమైన హద్దులెప్పుడో చెరిగిపోయాయి. ప్రాంతీయ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా విజయబావుటా ఎగరేస్తోంది. ‘పాన్‌ ఇండియా’ పాత మాట...

6 గెటప్పులు.. 38 భాషలు

సినిమాకి భాషా పరమైన హద్దులెప్పుడో చెరిగిపోయాయి. ప్రాంతీయ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా విజయబావుటా ఎగరేస్తోంది. ‘పాన్‌ ఇండియా’ పాత మాట. ఇప్పుడంతా ‘గ్లోబల్‌ సినిమా’నే. అందులో భాగంగా ప్రముఖ నటుడు సూర్య కూడా ఓ పాన్‌ వరల్డ్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మించింది. వచ్చే యేడాది ఏప్రిల్‌ 11న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి 38 భాషల్లో విడుదల చేయనున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన చిత్రమిది. త్రీడీ హంగులు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. సూర్య ఓ యుద్ధ వీరుడిగా కనిపించనున్నారు. ఆయన ఆరు రకాల గెటప్పుల్లో దర్శన మివ్వబోతున్నారని టాక్‌. దిశా పటానీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Updated Date - 2023-11-21T00:28:39+05:30 IST