పాతికేళ్లు గడిచాయి!
ABN , First Publish Date - 2023-08-29T03:12:48+05:30 IST
చిరంజీవి - గుణశేఖర్ కాంబోలో రూపొందిన ‘చూడాలని ఉంది’ విడుదలై పాతికేళ్లయ్యింది. ఈ సినిమాతో చిరు తనయుడిగా నటించిన మాస్టర్ తేజా సజ్జా..

చిరంజీవి - గుణశేఖర్ కాంబోలో రూపొందిన ‘చూడాలని ఉంది’ విడుదలై పాతికేళ్లయ్యింది. ఈ సినిమాతో చిరు తనయుడిగా నటించిన మాస్టర్ తేజా సజ్జా.. ఈరోజు పాన్ ఇండియా హీరో అయ్యాడు. తను నటించిన ‘హనుమాన్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజా సజ్జా ఓ నోట్ విడుదల చేశారు. ‘చూడాలని ఉంది’ మేకర్స్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పాతికేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. ఏం జరుగుతోంది అనే అవగాహన లేకుండా చిత్రసీమలోకి అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది. ఎంతో దయ గలిగిన లెజెండ్‌తో నా మొదటి పెర్‌ఫార్మ్సెన్స్ మొదలైంది. ఇప్పుడు ‘హనుమాన్’ కోసం ఎదురు చూస్తున్నాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది’’ అని ఆనందం వ్యక్తం చేస్తూ ‘చూడాలని ఉంది’ విజయోత్సవ వేడుకలో చిరుతో ఉన్న ఫొటోని షేర్ చేసుకొన్నారు.