Oscar: ఆస్కార్‌ కోసం భారత్‌ నుంచి పది చిత్రాలు

ABN , First Publish Date - 2023-01-11T00:10:53+05:30 IST

ఈసారి ఆస్కార్‌ బరిలో భారతీయ చిత్రాల జోరు గట్టిగానే కనిపిస్తోంది. ఉత్తమ చిత్రం కేటగిరిలో మన దేశం నుంచి ఏకంగా పది చిత్రాలు పోటీ పడబోతున్నాయి.

Oscar: ఆస్కార్‌ కోసం భారత్‌ నుంచి పది చిత్రాలు

ఈసారి ఆస్కార్‌ బరిలో భారతీయ చిత్రాల జోరు గట్టిగానే కనిపిస్తోంది. ఉత్తమ చిత్రం కేటగిరిలో మన దేశం నుంచి ఏకంగా పది చిత్రాలు పోటీ పడబోతున్నాయి. ఈ చిత్రాల జాబితాని ఆస్కార్స్‌ ప్రకటించింది. ‘ఛల్లో షో’ అధికారిక ఎంట్రీగా వెళ్తే, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కాంతారా’, ‘విక్రాంత్‌ రోణ’, ‘గంగూభాయ్‌’, ‘మి వసంతరావ్‌’, ‘రాకెట్రీ’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘ఇరవిన్‌ నిళల్‌’ ఓపెన్‌ కేటరిరీలో పోటీ పడుతున్నాయి. మొత్తమ్మీద ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ చిత్రం కోసం 301 చిత్రాలు బరిలో నిలిచాయి. 95వ ఆస్కార్‌ పురస్కారాలకు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాని జనవరి 25న ప్రకటిస్తారు. మార్చి 12న విజేతల వివరాలు వెల్లడిస్తారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు దక్కాలని ప్రముఖ కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ ఆకాంక్షించారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీమ్‌ భారతదేశానికి ఆస్కార్‌ తీసుకొచ్చినప్పుడు ఆ అవార్డు తననీ ఒక్కసారి తాకనివ్వాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు.

Updated Date - 2023-01-11T08:44:21+05:30 IST