మా ఊరి పొలిమేర మూడో భాగం కూడా ఉంది
ABN , First Publish Date - 2023-10-31T05:53:42+05:30 IST
‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో ఆకట్టుకొన్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా సిద్ధమైంది. ఈ శుక్రవారం విడుదల కానుంది. ...

‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో ఆకట్టుకొన్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా సిద్ధమైంది. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం అనిల్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మా ఊరి పొలిమేర హాట్ స్టార్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. ఆ కథని గంట నలభై ఐదు నిమిషాల్లోనే ముగించాం. పార్ట్ 1 ఎక్కడైతే ఆగిందో, పార్ట్ 2 కథ అక్కడి నుంచి మొదలవుతుంది. పార్ట్ 1 చివరి 20 నిమిషాల్లో మూడు ట్విస్టులు వచ్చాయి. అవి ప్రేక్షకుల్ని ఉత్కంఠతకు గురి చేశాయి. పార్ట్ 2లో ఏడెనిమిది ట్విస్టులు ఉన్నాయి. క్వాలిటీ పరంగా రెండో భాగం మరింత బాగుంటుంది. పార్ట్ 3 కథ కూడా సిద్ధంగా ఉంది. ‘మా ఊరి పొలిమేర’ని ఓ ఫ్రాంచైజీగా తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. నాలుగో భాగం, ఐదో భాగం కూడా ఉండొచ్చు. ప్రచార చిత్రాలు చూసిన వాళ్లు ‘కార్తికేయ’తో పోలికలు తీసుకొస్తున్నారు. కానీ ‘కార్తికేయ’కూ మా కథకూ సంబంధం లేదు. ‘మా ఊరి పొలిమేర’ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆ సౌండ్, విజువల్స్ థియేటర్లో చూస్తేనే మరింత కిక్ వస్తుంది. రెండు మూడు కథలు సిద్ధం చేసుకొన్నా. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. త్వరలోనే కొత్త సినిమా విషయాలు చెబుతా’’ అన్నారు.