Tiger 3: మాక్కూడా చాలా బాధగా వుంది: టైగర్ 3 దర్శకుడు

ABN , First Publish Date - 2023-11-07T15:02:54+05:30 IST

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న 'టైగర్ 3' సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో టైగర్, జోయా మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి అంటూ...

Tiger 3: మాక్కూడా చాలా బాధగా వుంది: టైగర్ 3 దర్శకుడు
Salman Khan and Katrina Kaif from Tiger 3

య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో (YashRajFilms) వచ్చే సినిమాలలో ఎప్పుడూ సీక్రెసీ మేజ‌ర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని క్రియేట్ చేయ‌డానికి ఈ సీక్రెసీని చూపిస్తూ చేస్తుంటారు చిత్ర నిర్వాహకులు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ (SalmanKhan), కత్రినా కైఫ్ (KatrinaKaif) నటించిన 'టైగ‌ర్‌3' #Tiger3 లోనూ ఆదిత్య చోప్రా (AdityaChopra) అలాంటిదే ఒకటి పెట్టారు. 'టైగ‌ర్‌3'లోని రెండో పాట 'ప్ర‌తి క‌ణం క‌ణం'లో ఉన్న మేజ‌ర్ ప్లాట్ పాయింట్‌ని సినిమాలో చూసి తీరాల్సిందేన‌ని అంటున్నారు ఆదిత్య చోప్రా (AdityaChopra).

ఈ పాట‌ను గురించి దర్శకుడు మ‌నీష్ శ‌ర్మ (ManeeshSharma) మాట్లాడుతూ, "టైగ‌ర్‌, జోయా మ‌ధ్య ఈ సినిమాలో అత్య‌ద్భుత‌మైన ప్రయాణం ఉంటుంది. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా అన్యోన్యంగా అనిపిస్తాయి. 'ప్ర‌తి క‌ణం క‌ణం' పాట అందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌. ఈ పాట‌ను చాలా బాగా చిత్రీక‌రించాం. ఇందులోని దృశ్యాల‌ను, ఇలాంటి మ‌రికొన్ని కీల‌క అంశాల‌ను ప్రేక్ష‌కులు వెండితెర‌మీద అనుభూతి చెందాలి," అని అన్నారు.

salmankhankatrinakaif.jpg

వీడియో సాంగ్‌ని హోల్డ్ చేయ‌డం గురించి చెబుతూ, "చాలా సోల్‌ఫుల్ సాంగ్ ఇది. స‌ల్మాన్‌ఖాన్ మీద తెర‌కెక్కించిన ఇంత గొప్ప పాట‌ను ప్రేక్ష‌కుల‌కు చూప‌కుండా ఆప‌డం మాక్కూడా బాధ‌గానే ఉంది. కానీ కొన్నిసార్లు త‌ప్ప‌దు. #YRFSpyUniverse ఎందుకంటే, వెండితెర మీద ఈ పాట‌ను చూసిన‌ప్పుడు, మేం ఎందుక‌లా చేయాల్సి వ‌చ్చిందో ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా అర్థ‌మ‌వుతుంది. ఆడియ‌న్స్‌కి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్ అందించ‌డానికే ప్ర‌స్తుతం మేం ఈ ప‌ని చేస్తున్నాం", అని అన్నారు.

Updated Date - 2023-11-07T15:02:55+05:30 IST