RIP Pamela: ప్రముఖ నిర్మాత సతీమణి మృతి!

ABN , First Publish Date - 2023-04-20T15:59:33+05:30 IST

బాలీవుడ్‌లో (Bollywood) విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత దివంగత యశ్‌ చోప్రా భార్య నిర్మాత, సింగర్‌ పమేలా(74) (Pamela Chopra passes away) కన్నుమూశారు.

RIP Pamela:  ప్రముఖ నిర్మాత సతీమణి మృతి!

బాలీవుడ్‌లో (Bollywood) విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత దివంగత యశ్‌ చోప్రా భార్య నిర్మాత, సింగర్‌ పమేలా(74) (Pamela Chopra passes away) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను 15 రోజుల క్రితం ముంబై లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. (Pamela singh) న్యూమోనియాతో బాధపడుతున్న పమేలా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు(RIP Pamela). పమేలా భర్త, ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా 2012లో మృతి చెందారు. ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య చోప్రా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో కుమారుడు ఉదయ్‌ చోప్రా నటనారంగంలో ఉన్నారు. (Yashraj Films)

పమేలా చోప్రా 1949 జూలైలో జన్మించారు. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా యశ్‌ చోప్రా (yash chopra) కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. 1970లో పమేలా యశ్‌ చోప్రాను వివాహం చేసుకున్నారు. ఎన్నో హిట్‌ సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కథా రచయితగా, గాయనిగా, డ్రెస్‌ డిజైనర్‌గానే కాకుండా యశ్‌ రాజ్‌ సంస్థలో పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన అనుభవం ఉంది. తదుపరి పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. యశ్‌ చోప్రా దర్శక నిర్మాతగా రూపొందిన ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘కబీ కబీ’ చిత్రాలకు పమేలా రచయితగా పనిచేశారు. ఆమె మరణ వార్త తెలుసుకుని బాలీవుడ్‌ కన్నీరుమున్నీరైంది. షారుక్‌ఖాన్‌, కరణ్‌జోమార్‌, శ్రద్ధాకపూర్‌ వంటి బాలీవుడ్‌ స్టార్లు యశ్‌చోప్రా నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.

Untitled-1.jpg

Updated Date - 2023-04-20T15:59:33+05:30 IST