Waheeda Rehman : నటిగా ఐదు దశాబ్దాల సేవలకుగానూ.. ప్రతిష్టాత్మక పురస్కారం!

ABN , First Publish Date - 2023-09-26T14:20:05+05:30 IST

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి వహీదా రెహమాన్‌ (Waheeda Rehman) దాదా’సాహెబ్‌ ఫాల్కే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు (Dadasaheb Phalke) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

Waheeda Rehman : నటిగా ఐదు దశాబ్దాల సేవలకుగానూ.. ప్రతిష్టాత్మక పురస్కారం!

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి వహీదా రెహమాన్‌ (Waheeda Rehman) దాదా’సాహెబ్‌ ఫాల్కే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు (Dadasaheb Phalke) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఐదు దశాబ్దాల పాట భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 1955లో ‘రోజు మారాయి’ తెలుగు చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు వహీదా రెహమాన్‌. ఈ చిత్రంలోని ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట ఆమెకు  మంచి గుర్తింపు తెచ్చింది. తదుపరి జయసింహ, బంగారు కలలు, సింహాసనం, చుక్కల్లో చంద్రుడు చిత్రాల్లో నటించారు. 2018లో కమల్‌హాసన్‌ తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’ చిత్రంలో కశ్మీరీ మదర్‌గా నటించారు. అయితే ఆమె కెరీర్‌లో ఎక్కువ హిందీ చిత్రాల్లో నటించారు. (life time Achivement)

వహీదా రెహ్మాన్‌ను 1972లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారంతో, 2011లో పద్మ్ఘభూషణ్‌ పురస్కారంలో సత్కరించింది. ఐదు దశాబ్ధాలకుపైగా నటిగా భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగానూ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. వహీదా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. 1974లో శశిరేఖిని ని వివాహం చేసుకున్నారామె. 2000 సంవత్సరంలో భర్త మరణించడంతో ఆమె తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారు.

Updated Date - 2023-09-26T14:29:53+05:30 IST