సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vivek Agnihotri: మమతా బెనర్జీకు లీగల్‌ నోటీసు!

ABN, First Publish Date - 2023-05-09T16:53:45+05:30

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా దేశంలో రాజకీయంగా ఎంతగా ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే! ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానిది కూడా అదే పరిస్థితి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) సినిమా దేశంలో రాజకీయంగా ఎంతగా ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే! ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala story) చిత్రానిది కూడా అదే పరిస్థితి. ఈ చిత్రం విడుదల కాకుండా బ్యాన్‌ చేయాలని కేరళతోపాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు డిమాండ్‌ చేశాయి. అడ్డుకునే ప్రయత్నాలూ చేశాయి. చిత్రంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేశాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ సినిమాను బ్యాన్‌ చేసింది. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ రెండు చిత్రాల గురించి మమత స్పందించారు. (legal notice to Mamatha Benerjee)

‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. ‘ది కేరళ స్టోరీ’ వక్రీకరించిన కథ అంటూ కామెంట్‌ చేశారు. అందుకే ఈ చిత్రాన్ని కేరళలో బ్యాన్‌ చేశారు అని ఆమె పేర్కొన్నారు. అయితే మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి మండిపడ్డారు. ఈ మేరకు మమతకు లీగల్‌ నోటీస్‌ పంపించారు. తాను దర్శకత్వం వహించిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను లీగల్‌ నోటీస్‌ పంపించానని వివేక్‌ తెలిపారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాతోపాటు తన రాబోయే సినిమా కూడా పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ ఆధారంగా తీస్తున్న సినిమా అని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అదంతా తప్పుడు ప్రచారం. పైగా నేను తీస్తున్న చిత్రాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపిస్తున్నారు. అది కూడా తప్పుడు ఆరోపణే’’ అని వివేక్‌ అగ్రిహోత్రి అన్నారు.

Updated Date - 2023-05-09T16:53:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!