Vivek agnihotri - Prabhas: రాత్రి తాగి.. ఉదయాన్నే దేవుడంటే.. జనాలు పిచ్చోళ్లు కాదు!

ABN , First Publish Date - 2023-07-27T22:49:53+05:30 IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌పై బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి పరోక్షంగా కామెంట్స్‌ చేశారని బాలీవుడ్‌లో పలు వెబ్‌ మాధ్యమాలు కథనాలు రాసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై వివేక్‌ అగ్రిహోత్రి స్పందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాసః అంటే నాకు గౌరవం ఉంది.

Vivek agnihotri - Prabhas: రాత్రి తాగి.. ఉదయాన్నే దేవుడంటే.. జనాలు పిచ్చోళ్లు కాదు!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌పై (Prabhas) బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek agnihotri) పరోక్షంగా కామెంట్స్‌ చేశారని బాలీవుడ్‌లో పలు వెబ్‌ మాధ్యమాలు కథనాలు రాసుకొచ్చాయి. ‘‘ప్రజల నమ్మకాలకు సంబంధింయిర కథలను ఎంచుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దానిపై విశ్వాసం ఉండాలి. లేదంటే ఆ సబ్జెక్ట్‌ మీద ఆయా వ్యక్తులకు నాలెడ్జ్‌ ఉండాలి. దురృష్టవశాత్తు భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోట్లేదు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పెద్ద పెద్ద స్టార్లతో కలిసి సినిమాగా చేయాలనుకుంటే అది అంత ఈజీగా పూర్తవదు. ఒకవేళ పూర్తి చేసినా అది సంపూర్ణంగా ఉండదు. ఈ పురాణాలే వేల సంవత్సరాలుగా అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే దానికున్న గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. కొందరు స్ర్కీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు భగవంతుడు అయిపోతాడా? ప్రతి రోజు రాత్రి తాగి ఇంటికి వచ్చి తెల్లవారగానే నేను దేవుణ్ణి నన్ను నమ్మండి అంటే జనాలు పిచ్చోళ్లు కాదు’’ అని ఆ కథనం సారాంశం. (vivek agnihotri comments on prabhas)

ప్రస్తుతం ఈ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై వివేక్‌ అగ్రిహోత్రి స్పందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాసః అంటే నాకు గౌరవం ఉంది. అలాంటి పెద్ద స్టార్‌హీరో సినిమాతో నేనెలా పోటీపడతాను? అని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. ప్రభాస్‌ సినిమాతో మరోసారి పోటీ పడుతున్నాననే మాటలను నాకు ఆపాదించి అసత్య ప్రచారాలు చేస్తున్నది ఎవరు? నాకు ప్రభాస్‌పై అమితమైన గౌరవం ఉంది. ఆయన పెద్ద స్టార్‌ భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తాడు. నేను చిన్న బడ్జెట్‌ సినిమాలు చేస్తుంటాను. మా మధ్య ఎలాంటి పోలికలు లేవు. దయచేసి నన్ను నమ్మండి . ప్రభాస్‌ ‘సలార్‌’తో నేను పోటీ పడట్లేదు’’అని పేర్కొన్నారు.

ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వివేక్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘రామాయణం’, ‘మహాభారత ఇతిహాసాల ఆధారంగా సినిమాలు చేసేవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఫ్రీ లైఫ్‌కు అలవాటు పడిన కొంతమంది నటులు దేవుడి పాత్రలో నటిస్తే ప్రేక్షకులు అంగీకరించరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలను పలు ఇంగ్లిష్‌ వెబ్‌సైట్స్‌ ప్రభాస్‌కు ఆపాదించడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.

Updated Date - 2023-07-28T10:22:13+05:30 IST