Vivek agnihotri : ఆడితే ఓకే.. లేకపోతే మళ్లీ పాత స్థితికి వెళ్తా!

ABN , First Publish Date - 2023-09-24T15:46:17+05:30 IST

ది కశ్మీర్‌ ఫైల్స్‌’ భారీ విజయం తర్వాత వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihothri) తెరకెక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (vaccine war). వివేక్‌ రిలీజ్‌కు ముందు ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకూ ప్రభాస్‌ ‘సలార్‌’తో పోటీ అంటూ వచ్చిన వార్తలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Vivek agnihotri : ఆడితే ఓకే.. లేకపోతే మళ్లీ పాత స్థితికి వెళ్తా!

'ది కశ్మీర్‌ ఫైల్స్‌’ భారీ విజయం తర్వాత వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihothri) తెరకెక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (vaccine war). వివేక్‌ రిలీజ్‌కు ముందు ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. మొన్నటి వరకూ ప్రభాస్‌ ‘సలార్‌’తో పోటీ అంటూ వచ్చిన వార్తలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం విడుదల వాయిదా పడడంతో ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ అనుకున్న సమయానికే సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వివేక్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ తన సినిమాపై నిషేదం విధించినట్లుందని పేర్కొన్నారు. అందుకే ఇప్పటివరకూ ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదని ఆరోపణలు చేశారు వివేక్‌. తన సినిమాపై రివ్యూలు చెప్పకుండా ఉండేందుకు ఇప్పటికే చాలామందికి డబ్బులు కూడా పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు.

వివేక్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నేను బాక్సాఫీస్‌ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకాన్ని కాదు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ విజయం అందుకున్నాక ఆ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాలని పేరు పొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు నన్ను సంప్రదించారు. దాదాపు రూ.300 కోట్ల వరకూ ఇవ్వడానికి సిద్థపడ్డారు. కాకపోతే నేను వాళ్ల ట్రాప్‌లో పడలేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడిన కష్టాలను ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా. అందుకే తక్కువ బడ్జెట్‌లో ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సిద్థం చేశా. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు వచ్చిన లాభాలను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశా. ఈ సినిమాకు ఆదరణ రాకపోతే నా పరిస్థితి గతంలో మాదిరిగా మారుతుంది’’ అని అన్నారు.

Updated Date - 2023-09-24T15:46:17+05:30 IST