Vivek Agnihotri: మమ్మల్ని టార్గెట్‌ చేసి.. దూరం పెట్టారు.. కానీ!

ABN , First Publish Date - 2023-05-05T16:39:20+05:30 IST

బాలీవుడ్‌ (Bollywood) చిత్రాలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయన్నా దర్శకుడు వివేక్‌ అగ్రిహోత్రి(Vivek Agnihotri). అందుకే ఆదరణకు నోచుకోవట్లేదని,

Vivek Agnihotri: మమ్మల్ని టార్గెట్‌ చేసి.. దూరం పెట్టారు.. కానీ!

బాలీవుడ్‌ (Bollywood) చిత్రాలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయన్నా దర్శకుడు వివేక్‌ అగ్రిహోత్రి(Vivek Agnihotri). అందుకే ఆదరణకు నోచుకోవట్లేదని, ఈ కారణంగానే ప్రజలు బాలీవుడ్‌ని విమర్శిస్తూ బాయ్‌కాట్‌ చేస్తున్నారంటూ బాలీవుడ్‌పై కామెంట్స్‌ చేశారు. బీటౌన్‌లో జరుగుతున్న తప్పులను ప్రశ్నించేవారు లేరని ఆయన అన్నారు. తప్పుని తప్పని చెప్పే నన్ను, కంగనా రనౌత్‌(Kangana ranuth) ను టార్గెట్‌ చేసి ఇండస్ట్రీలో లేకుండా చేస్తున్నారు అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్‌ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. (Bollywood Targeted Vivek Agnihotri)

‘‘హిందీ చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా దూరం పెట్టేసింది. అయితే నా అదృష్టం ఏంటంటే అభిమానులు, ప్రేక్షకుల సపోర్ట్‌ నాకు ఉండటమే! వాళ్లు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న హిందీ చిత్రాలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కరణ్‌ జోమార్‌ తన సినిమాల్లో చూపించేలా దేశంలోని యువత లేరు. గతంలో బాలీవుడ్‌ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేవారు. ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. అందుకే సక్సెస్‌ రేటు పడిపోయింది. ఆ కారణంగానే బాలీవుడ్‌ని విమర్శిస్తూ బాయ్‌కాట్‌ చేస్తున్నారు. దేశంలో పెద్ద పరిశ్రమగా ఉన్న ఈ ఇండస్ర్టీలో జరిగే తప్పుల గురించి నేనూ కంగనా తప్ప మరెవ్వరూ ప్రశ్నించరు. అందుకే బాలీవుడ్‌లో కొందరు మమ్మల్ని టార్గెట్‌ చేసి దూరం పెడుతున్నారు. తప్పు చేేస్త ప్రశ్నించే హక్కు మాకుంది’’ అని వివేక్‌ అగ్నిహోత్రి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి. గతంలో కూడా వివేక్‌ బహిరంగంగానే బాలీవుడ్‌పై విమర్శలు చేశారు. ‘నెపోటిజం’ గురించి గొంతెత్తి మాట్లాడారు. ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’తో భారీ విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం ‘ద వ్యాక్సిన్‌ వార్‌’, ‘ ద ఢిల్లీ వార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Updated Date - 2023-05-05T16:39:20+05:30 IST