కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vivek Agnihotri : కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి నుంచి మహాభారతం.. ఎన్ని భాగాలంటే !

ABN, First Publish Date - 2023-10-21T14:59:46+05:30

గత ఏడాది 'ది కశ్మీర్‌ ఫైల్స్‌’, 'ది వాక్సిన్  వార్‌’ చిత్రాలతో సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి(Vivek Agnighothri). తాజాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. 'మహాభారతం’(Maha bharatham) ఆధారంగా తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తునట్లు వెల్లడించారు.

గత ఏడాది 'ది కశ్మీర్‌ ఫైల్స్‌’, 'ది వాక్సిన్  వార్‌’ చిత్రాలతో సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి(Vivek Agnighothri). తాజాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. 'మహాభారతం’(Maha bharatham) ఆధారంగా తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తునట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. కన్నడ రచయిత ఎన్‌.ఎల్‌.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన ‘పర్వ’ (Parva) అనే పుస్తకాన్ని వివేక్‌ అగ్నిహోత్రి సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని వివేక్‌ అగ్నిహోత్రి ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘పర్వ’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇలాంటి ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, త్వరలో ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని పల్లవి జోషి నిర్మిస్తున్నారు. అయితే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో కాలంగా 'మహాభారతం' చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయనకన్నా ముందు బాలీవుడ్ దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. 

తాజాగా వివేక్‌ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్‌ వార్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

Updated Date - 2023-10-21T15:23:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!