Vishal Bhardwaj: బాలీవుడ్ షార్ట్‌ఫిల్మ్‌పై యాపిల్ సీఈవో ప్రశంసలు.. అలా తీయడమే కారణం..

ABN , First Publish Date - 2023-02-06T09:58:47+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న దర్శకుల్లో విశాల్ భరద్వాజ్ (Vishal Bhardwaj) ఒకరు. ఇటీవల ఈయన ‘ఫుర్‌సత్’ అనే షార్ట్‌ఫిల్మ్‌ని తెరకెక్కించాడు. అయితే.. అది నార్మల్ కెమెరాతో కాదు.

Vishal Bhardwaj: బాలీవుడ్ షార్ట్‌ఫిల్మ్‌పై యాపిల్ సీఈవో ప్రశంసలు.. అలా తీయడమే కారణం..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న దర్శకుల్లో విశాల్ భరద్వాజ్ (Vishal Bhardwaj) ఒకరు. ఇటీవల ఈయన ‘ఫుర్‌సత్’ (Fursat) అనే షార్ట్‌ఫిల్మ్‌ని తెరకెక్కించాడు. అయితే.. అది నార్మల్ కెమెరాతో కాదు. కేవలం యాపిల్ ఐఫోన్ (iPhone)తో తీశాడు. ఈ విషయం తెలిసిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) ఈ బాలీవుడ్ డైరెక్టర్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు.

టిమ్ కుక్ షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘భవిష్యత్తు గురించి తెలిస్తే జరిగే పరిణామాలను అంచనా వేయగలిగే బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఆయన తీసిన ఈ అందమైన చిత్రాన్ని చూడండి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ’ అని రాసుకొచ్చాడు.


టిమ్ ట్వీట్‌పై విశాల్ భరద్వాజ్ స్పందించాడు. ‘ఇలాంటి అద్భుతమైన ప్రశంసతో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశానికి యాపిల్‌కి ధన్యవాదాలు!’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విశాల్‌ని ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘మమ్మల్ని గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు సర్’.. ‘షార్ట్ ఫిల్మ్ సూపర్‌గా ఉంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-02-06T09:58:49+05:30 IST