Urvashi rautela: కేన్స్‌లో సందడి... మరోవైపు ట్రోలింగ్‌

ABN , First Publish Date - 2023-05-23T16:06:21+05:30 IST

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తన అందాలతో ఆహుతుల్ని ఆకర్షిస్తోంది ఊర్వశి రౌతేలా. రోజుకో వస్ర్తాధారణతో హోయలు ఒలికిస్తోంది. తాజాగా ముదురు నీలి రంగు లిప్‌స్టిక్‌తో సందడి చేసింది.

Urvashi rautela: కేన్స్‌లో సందడి... మరోవైపు ట్రోలింగ్‌

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో (Cannes Film Festival) తన అందాలతో ఆహుతుల్ని ఆకర్షిస్తోంది ఊర్వశి రౌతేలా (urvashi rautela) రోజుకో వస్ర్తాధారణతో హోయలు ఒలికిస్తోంది. తాజాగా ముదురు నీలి రంగు లిప్‌స్టిక్‌తో సందడి చేసింది. ఎర్ర తివాచీ మీద ఆమె చేసే సందడిని కొందరు ఆస్వాదిస్తుంటే కొందరు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఆమె ధరించిన మొసలి నెక్లెస్‌పై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఆ రోజు ఈవెంట్‌లో పింక్‌ కలర్‌ గౌను ధరించిన ఊర్వశి.. మెడలో మొసలి నెక్లెస్‌, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. అవంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. ఆ తర్వాత దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. ‘అంత పెద్ద వేడుకకు నకిలీ నెక్లెస్‌ పెట్టుకుని వెళ్లారా మేడమ్‌’ అంటూ ట్వీట్లు చేశారు. కొందరు సెలబ్రిటీలు విమర్శించారు కూడా. దీంతో ఆమె టీమ్‌ దీని ధర చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ‘‘ఊర్వశి ధరించిన నెక్లెస్‌ ఫేక్‌ కాదు. దాని ధర రూ.276 కోట్ల దాకా ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్‌ అభిరుచిని తెలుపుతుంది’’ అని పేర్కొన్నారు. (Trolling on Urvasi)

ప్రస్తుతం ఆ నెక్లెస్‌ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘నెక్లెస్‌ అంత ధర ఉంటుందా? జోక్‌ బాగుంది’, అని కామెంట్లు పెడుతున్నారు. ఆ నెక్లెస్‌ ఒరిజినల్‌ కాదని మరికొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి ఆడిపాడింది. ఆ తర్వాత అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్‌’లోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది.

Updated Date - 2023-05-23T16:07:04+05:30 IST