Urvashi Rautela: భారత, పాకిస్తాన్ మ్యాచ్ లో బంగారం ఐఫోన్ పోగొట్టుకున్న ఈ బాలీవుడ్ నటి

ABN , First Publish Date - 2023-10-16T17:43:11+05:30 IST

బాలీవుడ్ నటి, టాలీవుడ్ లో అగ్ర నటులు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌటేలా తన ఖరీదైన గోల్డ్ ఐఫోనుని మొన్న జరిగిన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో పోగొట్టుకుంది.

Urvashi Rautela: భారత, పాకిస్తాన్ మ్యాచ్ లో బంగారం ఐఫోన్ పోగొట్టుకున్న ఈ బాలీవుడ్ నటి
Urvashi Rautela

మొన్న జరిగిన భారత, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ #IndiaVsPakistanCricket కి చాలామంది సెలెబ్రెటీలు హాజరయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుండి ఎంతోమంది నటీనటులు, గాయకులూ, గాయనీమణులు, అలాగే దక్షిణాదికి చెందిన సినిమా తారలతో పాటు మిగతా రంగాల నుండి కూడా చాలామంది సెలెబ్రెటీలు ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. #CricketWorldCup2023 ఈ మ్యాచ్ లో భారత దేశం అతి సునాయాసంగా పాకిస్తాన్ ని ఓడించిన సంగతి తెలిసిందే. #NarendraModiStadium

urvashirautela-phone.jpg

ఈ మ్యాచ్ కి బాలీవుడ్ నటి, టాలీవుడ్ లో స్పెషల్ పాటలతో అదరగొడుతున్న ఊర్వశి రౌటేలా (UrvashiRautela) కూడా వెళ్లారు. మ్యాచ్ అయిపోయాక ఆమె ఫోను చూసుకుంటే అది లేదట. వెంటనే వెతికినా ఎక్కడా కనిపించలేదు. అందుకని ఈ విషయాన్ని ఆమె తన సాంఘీక మాధ్యమంలో తన ఫోను పోయినట్టుగా తెలిపింది. ఇదేదో మామూలు ఫోన్ కాదు, ఐఫోను, అందులోకి 24 కేరట్ల బంగారం ఫోను అని, ఇది ఎవరికైనా దొరికితే వెంటనే ఇచ్చేయాలని ఆమె తన సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చేసింది.

urvashirautela-phone1.jpg

అలాగే అహ్మదాబాద్ సిటీ (Ahmedabad) పోలీసులకి కూడా అందులో టాగ్ చేసింది, వాళ్ళు వివరాలు తీసుకొని వెంటనే కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఫోను వెతికే పనిలో వున్నారని కూడా తెలిసింది. అహమ్మదాబాదు లో జరిగిన ఆ క్రికెట్ మ్యాచ్ ని సుమారు లక్ష మందికి పైగా ప్రేక్షకులు తిలకించారు. అందులో ఈమె ఫోన్ ఎవరికి దొరికిందో మరి. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊర్వశి ప్రేక్షకులతో చాలా సెల్ఫీ లు దిగుతూ ఉండటం, అక్కడ ఎక్కువమంది ఉండటం, ఆ సమయంలో ఈ ఫోన్ పోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఊర్వశి రౌటేలా 'ఏజెంట్' #Agent సినిమాలో అఖిల్ అక్కినేనితో (AkhilAkkineni), 'వాల్తేర్ వీరయ్య' #WaltairVeerayya సినిమాలో చిరంజీవితో (Chiranjeevi), 'బ్రో' #Bro సినిమాలో పవన్ కళ్యాణ్ (PawanKalyan) తో, ఈమధ్య విడుదలైన 'స్కంద' #Skanda సినిమాలో రామ్ పోతినేనితో (RamPothineni) స్పెషల్ సాంగ్స్ చేసి ఐటెం సాంగ్ స్పెషలిస్ట్ గా పేరుపొందింది.

Updated Date - 2023-10-16T17:43:11+05:30 IST