Urvashi Rautela: పోయిన బంగారు ఫోను దొరికింది, కానీ ఒక షరతు... ఇదేమి ట్విస్టురా బాబూ

ABN , First Publish Date - 2023-10-21T12:16:30+05:30 IST

ఎట్టకేలకు బాలీవుడ్ నటి, టాలీవుడ్ ఐటెం సాంగ్ స్పెషలిస్ట్ అయిన ఊర్వశి రౌటేలా ఫోను దొరికింది. కానీ ఆమె ఫోను తిరిగి ఆమె దగ్గరికి రావాలంటే, ఒక షరతు పెట్టాడు ఒక అజ్ఞాత వ్యక్తి, ఇంతకీ ఆ షరతు ఏంటంటే...

Urvashi Rautela: పోయిన బంగారు ఫోను దొరికింది, కానీ ఒక షరతు... ఇదేమి ట్విస్టురా బాబూ
Urvashi Rautela

టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా ప్రత్యేకంగా ఆమె పేరు వినపడుతూ ఉంటుంది, ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా (UrvashiRautel). చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (PawanKalyan), అఖిల్ (AkhilAkkineni), రామ్ (RamPothineni) లాంటి అగ్రనటుల పక్కన ఆమె స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేసింది. ఈమెకి క్రికెట్ అంటే ఇష్టం, అలాగే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ కప్ ఇండియాలో జరుగుతోంది కదా, ఇండియా ఆడుతున్న మ్యాచ్ లకు ఊర్వశి వెళుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ (CricketWorldCup23) మ్యాచ్ కి ఊర్వశి రౌటేలా వెళ్ళింది. అక్కడ అభిమానులను కూడా కలిసి, వాళ్లందరికీ సెల్ఫీ లు ఇచ్చింది, ఫోటోలకి పోజులు కూడా ఇచ్చింది.

ఆలా ఇస్తున్నప్పుడే ఆమె బంగారు ఫోనుని పోగొట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తరువాత తన ఫోను తన దగ్గర లేదు అని గుర్తించి అక్కడే వెతికింది, కానీ దొరకలేదు, వెంటనే తన సాంఘీక మాధ్యమంలో అదే విషయాన్నీ పెట్టింది. తన ఫోను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే స్టేడియం లో పోగొట్టుకున్నాను అని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇచ్చేయాలని, అందుకు తగిన బహుమతి కూడా ఇస్తాను అని పెట్టింది.

urvashirautela-phone.jpg

ఆ ఫోను విలువ చాలా ఖరీదు ఎందుకంటే ఆ ఫోను 24 క్యారెట్ల బంగారు ఐఫోన్‌ను అది. అలాగే తన ఫోన్ ను వెతికి పెట్టాలని అహమ్మదాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే వెంటనే ఎవరూ ఆమెని ఈ ఫోను గురించి సంప్రదించలేదు, కానీ నిన్న మాత్రం ఒక అజ్ఞాత వ్యక్తి ఆ ఫోను తన దగ్గర వుంది అని ఉర్వశికి మెసేజ్ పెట్టాడు. ఆ తరువాత ఆ ఫోను తిరిగి ఇవ్వాలంటే ఒక షరతు కూడా పెట్టాడు. ఇంతకీ ఆ షరతు ఏంటంటే, "నీ ఫోను నా దగ్గర వుంది. అది నీకు తిరిగి కావాలంటే, నువ్వు కాన్సర్ తో బాధపడుతున్న నా తమ్ముడికి సహాయం చెయ్యాలి," అని చెప్పారు. ఆమె దానికి ఒకే అని చెప్పినట్టుగా 'థంబ్స్ అప్' సింబల్ పెట్టింది.

అయితే ఇంతకీ అతను ఫోన్ తెచ్చి ఇచ్చాడా లేదా, ఊర్వశి అతను అడిగిన సహాయం చేసిందా, మళ్ళీ ఏమైంది అన్న విషయం ఇంకా తేలాల్సి వుంది.

Updated Date - 2023-10-21T12:16:30+05:30 IST