Urvashi Rautela: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఊర్వశి రౌటేలా కొత్త ఇల్లు, ధర తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-06-01T16:39:58+05:30 IST

బాలీవుడ్ అంత ఇప్పుడు షాక్ లో వుంది ఎందుకంటే నటి ఊర్వశి రౌటేలా కొత్త ఇల్లు చూసి. ఆ కొత్త ఇంటి గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది అని కూడా అంటున్నారు. అయితే ఆ ఇంటికి ఆమె ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే ఒక్క బాలీవుడ్ కాదు, అందరూ షాక్ అవ్వాల్సిందే

Urvashi Rautela: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఊర్వశి రౌటేలా కొత్త ఇల్లు, ధర తెలిస్తే షాక్ అవుతారు
Urvashi Rautela

ఊర్వశి రౌటేలా (UrvashiRautela) గుర్తుంది కదా, టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన ఐటెం గర్ల్. ఆమధ్య చిరంజీవితో (Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య' (WaltairVeerayya) లో 'బాస్ పార్టీ' (Boss Party) అంటూ చిందులేసిన అమ్మడు ఆ తరువాత అఖిల్ అక్కినేని (AkhilAkkineni) తో 'ఏజెంట్' #Agent సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఇప్పుడు ఊర్వశి వార్తల్లో వుంది. ఎందుకంటే ఆమె కొత్త ఇల్లు. అదేదో మామూలు ఇల్లు అనుకునేరు, అది మామూలు అయితే ఇక్కడ చర్చ ఎందుకు, ఆ కొత్త ఇల్లు చూసి బాలీవుడ్ అంతా షాక్ అవుతున్నారని వినిపిస్తోంది.

urvashirautela.jpg

ఆమె ముంబైలో ఇప్పుడు ఒక కొత్త బంగళా కొనుక్కుంది, అది ప్రముఖ ఫిలింమేకర్ యాష్ చోప్రా ఇంటి పక్కన అంటున్నారు. అయితే ఈ ఇల్లు లేదా బంగళా ఖరీదు ఎంతో తెలిస్తే అవాక్కయిపోతారు. (Urvashi Rautela bought a new house with 190 crore) అక్షరాలా 190 కోట్ల రూపాయలు. అదండీ మేటర్. ఇప్పుడు ఈమె ఇంటి గురించే మొత్తం బాలీవుడ్ లో చర్చ నడుస్తోంది అని కూడా అంటున్నారు.

ఊర్వశి కొత్త ఇంటిని ఎలా పోలుస్తున్నారు అంటే, స్వర్గం అనేది ఎవరికైనా తెలిస్తే, అది ఊర్వశి రౌటేలా ఇల్లే అని అంటున్నారు. అంత అందంగా, అంత సుందరంగా, అన్ని సదుపాయాలతో, అన్ని హంగులతో రంగు రంగుల దీపాలతో ఇల్లు మెరిసిపోతోంది అని మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంట్లో ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇంట్లో వున్న గార్డెన్ గురించి చెప్పుకోవాలి అని అంటున్నారు.

urvashirautela1.jpg

ఈ ఇంట్లో ఊర్వశి రౌటేలా తన వ్యాయామం కోసం ఒక జిమ్ కూడా కట్టుకుంది అని అంటున్నారు. ఇవన్నీ కాకుండా ఆ ఇంటికి డెకరేషన్, ఫర్నిచర్, ఇంటీరియర్ ఒకటేమిటి అన్నీ అద్భుతంగా వున్నాయి, ఒకసారి చూస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా వున్నాయి అని అంటున్నారు. ఈమె ఇంటి వెనకాల చాలా కాళీ జాగా పెట్టిందిట, ఆ జాగా పక్కనున్న దివంగత యాష్ చోప్రా గార్డెన్ కి కనెక్ట్ అయ్యేట్టు ఉంటుంది అని అంటున్నారు.

కొన్ని నెలల నుండి, ఒక మంచి ఇల్లు కోసం ఊర్వశి వెతుకుతూ వుంది అని చెప్తున్నారు. ఇంతకు ముందు లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో చూసి అక్కడ కొన్నాళ్ళు వుంది అని అంటున్నారు. అక్కడ నచ్చక ఈ కొత్త ఇల్లు ముంబై నడిబొడ్డున్న తీసుకుంది అని కూడా చెప్తున్నారు. ఇక ఆమె పని విషయానికి వస్తే, తెలుగులో రెండు సినిమాలు, అలాగే హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు చెప్తున్నారు. అది నెట్ ఫ్లిక్స్ కోసం అని తెలిసింది.

Updated Date - 2023-06-01T16:39:58+05:30 IST